సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. కుటుంబ సమగ్ర సర్వే లో ప్రజలు, తమ కుటుంబంలోని స్థితిగతులకు సంబంధించి అన్ని వివరాలను సక్రమంగా ఇవ్వాలని, ఇంటికి వచ్చే ఎన్యూమినేటర్లకు సరైన సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమగ్ర సర్వేకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిథులు, అందరూసహకరించాలన్నారు.