రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీల్స్‌ను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లు ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును సమీక్షించారు.