అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడా శ్రీశ్రీ పోచమ్మ దేవాలయంలో గురువారం నుండి దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆలయ నిర్వాహకులు చెట్టిగారి నరేందర్ తెలిపారు. ఆలయ ధర్మకర్త శెట్టి వసంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో కొలను సుభాష్ రెడ్డి, కొమరయ్య, రమేష్, చిట్టిగారి నరేందర్, పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.