దరఖాస్తుల ఆహ్వానం

79చూసినవారు
దరఖాస్తుల ఆహ్వానం
రాజేంద్రనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హిమబిందు తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ పొలిటికల్ సైన్స్, గణితం, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాల్లో ఒక్కో పోస్టు, కామర్స్ విభాగంలో రెండు లెక్చరర్ పోస్టులున్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ 55 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్