రాజేంద్రనగర్‌లో ఘనంగా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

84చూసినవారు
రాజేంద్రనగర్‌లో ఘనంగా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
రాజేంద్రనగర్‌లో మహాత్మా జ్యోతి రావు పూలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పూలే చేసిన గొప్ప కృషిని కొనియాడారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్మరణీయమని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్