కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చి 420 రోజులు గడిచినప్పటికీ, ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొంపల్లి జగదీష్ గురువారం అన్నారు. దాదాపు 14 నెలలు పాలనలో ఉన్నప్పటికీ, 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.