జవహర్ లాల్ నెహ్రూ జూ పార్క్ వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని జీహెచ్ఎంసీ శుక్రవారం తెలియజేసింది. సాధ్యమైనంత తక్కువ సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. ప్రస్తుతం వంతెన పై తార్ లేయర్ నిర్మాణం, మిడియన్ సెట్టింగ్ పనులు నిర్వహిస్తున్నారు.