రాజేంద్రనగర్: సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు

50చూసినవారు
రాజేంద్రనగర్: సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు
రాజేంద్రనగర్ మానసా హిల్స్లోని సమ్మక్క సారలమ్మ గుట్ట జాతరకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఎదురు పున్నమి సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమైన పనులను ప్రారంభించారు. సమ్మక్క సారలమ్మ గుట్టలకు రంగులు వేసి గద్దెలను వివిధ రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. గుట్టపైకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్