మూసీ బాధితులకు అండగా ఉంటూ వారి పక్షాన బీజేపీ పోరాడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, మైలార్ దేవి పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షికోట్, బైరాగిగూడ, గంధంగూడ తదితర ప్రాంతాల్లో మూసీ బాధితులతో సమావేశమయ్యారు. ఇందులో శివపురి కాలనీ, దత్తాత్రేయ కాలనీ, కిస్మత్ పూర్ ప్రాంతాలకు చెందిన వాసులతో సమీక్షించారు.