రాజేంద్రనగర్ సర్కిల్, మైలర్ దేవ్ పల్లి డివిజన్‌లో బాబుల్ రెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో రెండు సంవత్సరాలుగా ఉన్న బోరు నీటి సమస్యను నవ యువ యూత్ క్లబ్ దృష్టికి ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్. అనిత తీసుకురావడంతో, క్లబ్ తరపున నాయకులు సంతోష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమస్యను శుక్రవారం పరిష్కరించారు. విద్యార్థుల కోసం కొత్త బోరు ఏర్పాటు చేయడంతో పాటు కమ్యూనిటీ హాల్ బోరును కూడా అందుబాటులోకి తెచ్చారు.