మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి టౌన్షిప్ ఇంజీనియం స్కూల్ సమీపంలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుండి గుర్తుతెలియని దుండగుడు పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళలకు తీవ్ర గాయాలు కాగా స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.