వైఎస్ జగన్ ప్లాన్ బీ అదేనా?
కూటమి ప్రభుత్వం త్వరలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలకు హాజరు కావొద్దని వైసీపీ నిర్ణయించింది. ఈ సమావేశాలకు వైఎస్ జగన్ దూరంగా ఉండనున్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, తమ పార్టీకి ప్రతిపక్షంగా గుర్తించకపోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రతిరోజు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉంటామని వైఎస్ జగన్ వెల్లడించారు.