రాజేంద్రనగర్ సర్కిల్‌లోని నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1 నుండి 31వ తేదీ వరకు మైలర్ దేవ్ పల్లి డివిజన్‌లోని బావన ఋషి కాలనీ శ్రీ మార్కండేయ ట్రస్ట్ భవనంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రతి ఆదివారం మోటివేషన్ సెషన్లు కూడా ఉంటాయి. ఈ సందర్భంగా పాంఫ్లెట్లు అంగన్వాడీ టీచర్ అనిత, స్థానిక నాయకులు గోపాల్ నాయక్, రాజకుమార్ లకు అందజేశారు.