ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల మైలర్ దేవ్ పల్లి డివిజన్ యువజన నాయకులు రమేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తల కృషి, ప్రజల మద్దతుతో బీజేపీ మరోసారి తన అఖండ బలాన్ని చాటిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మైలర్ దేవ్ పల్లి డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి శనివారం స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు.