ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనల కోసం గురువారం డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రాజేంద్రనగర్ డిపో మేనేజర్ బద్రీనారాయణ తెలిపారు. ఉ.11 నుంచి మ.12 గంటల వరకు రాజేంద్రనగర్ డిపోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రయాణికులు 99592 26135లో సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని డీఎం కోరారు.