రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ భావన ఋషి కాలనీలోని శ్రీ పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన పొదుపు సంఘం ప్రారంభం సందర్భంగా, సామల యాదయ్య అధ్యక్షుడిగా, ఇప్పలపల్లి చిరంజీవి ఉపాధ్యక్షుడిగా, దొంత రాజు ప్రధాన కార్యదర్శిగా, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతి నెల 5వ తేదీన ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పొదుపు చెల్లింపులు నిర్వహిస్తారు అన్నారు.