రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ‘మానవ సేవే మాధవ సేవా’ సంస్థ ఆధ్వర్యంలో గురువారం శివరాంపల్లి ప్రాంతంలో ఓ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సామగ్రిని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఏర్వ కుమారస్వామి, రమేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, గౌరి, హేమలత, జ్యోతి, అనిత, శ్యామ్, మంజుల, భాగ్యలక్ష్మి, ప్రేమ దేవి, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.