ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణికొండ చైతన్య కాలనీలోని డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి తెలిపారు. ఉదయం నుండి శిబిరం అందుబాటులో ఉంటుందన్నారు. షుగర్, కిడ్నీ, లివర్, ఎముకలు, హిమోగ్లోబిన్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని ఆయన వివరించారు.