శంషాబాద్ ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో మహిళ లకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 30 రోజుల శిక్ష ణను ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ట్రస్టు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.