రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డు ప్రధాన రహదారిపై చాలా కాలంగా విద్యుత్ లైట్లు పనిచేయకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన నవ యువ యూత్ క్లబ్ సభ్యులు చొరవచూపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. వారు సంబంధిత అధికారులతో పలుమార్లు సంప్రదించి, సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునేలా చేశారు.