రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో గల స్క్రాప్ గోదాం లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒకసారిగా చెలరేగిన మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.