బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో నిర్మించిన నూతన కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర తెలిపారు. కిస్మత్ పూర్ లో సుమారు రెండు ఎకరాల స్థలంలో అధునాతన పధతిలో 12. 65 కోట్ల రూపాయలను వెచ్చించి కార్యాలయాన్ని నిర్మించారన్నారు. గురువారం ఉదయం కార్యాలయ భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.