టీపిసిసి ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సానం శ్రీనివాస్ గౌడ్‌ను మైలర్ దేవ్‌పల్లి డివిజన్ గణేశ్‌నగర్‌లో ఉన్న ఆయన స్వగృహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి రాజేంద్రనగర్ సర్కిల్ నేతలు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సానెం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ మీద నమ్మకంతో, నాయకత్వం నాకు అందించిన ఈ బాధ్యతను న్యాయంగా నిర్వర్తిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీను బలపరిచే దిశగా కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతానన్నారు.