
నేడు వరంగల్ జిల్లాలో ప్రపంచ సుందరీమణుల పర్యటన
వరంగల్ జిల్లాలో మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం పర్యటించనున్నారు. ప్రపంచ సుందరీమణుల పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టిన అధికారులు, భద్రతపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన అందాల భామలు, ప్రాచీన వారసత్వ గల వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. తెలుగు సాంప్రదాయ నృత్యాలు పేరణి, గుస్సాడి, కూచిపూడి ప్రదర్శనలను వీక్షించనున్నారు.