జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా శివరాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తుందని, 1-19 సంవత్సరాల పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు.