రాజేంద్రనగర్ సర్కిల్, మైలర్ దేవ్ పల్లి డివిజన్, బుద్వేల్ వెంకటేశ్వర కాలనీకి చెందిన నవీన్ రెడ్డి దుర్గనగర్ మండల ప్రాథమిక పాఠశాల నీటి సౌకర్యం కోసం తన వంతు సహాయంగా సిల్టేక్స్ ట్యాంక్ ను మంగళవారం విరాళంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి నవ యువ యూత్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ, పాఠశాల సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.