రాజేంద్రనగర్: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

61చూసినవారు
రాజేంద్రనగర్: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
రాజేంద్రనగర్ సర్కిల్ నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బుద్వేల్ నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్లబ్ సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించారు. కేక్ కట్ చేసి, విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్