హైదర్ గూడా చైతన్య విల్లాస్ కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస పంచామృత అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామి వారికి పంచామృత అభిషేకం ప్రారంభం అవుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నలుగురు వేద పండితులు ఈ పూజ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. పంచామృత అభిషేకం పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.