రాజేంద్రనగర్: బోనాల పండుగకు ముస్తాబవుతున్న పోచమ్మ తల్లి ఆలయం

4చూసినవారు
మైలర్ దేవ్ పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లోని పోచమ్మ తల్లి ఆలయం ఆషాఢమాసం బోనాల పండుగకు ముస్తాబు అవుతోంది. ప్రస్తుతం పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని, ఈనెల 13వ తేదీన ఘటాల ఊరేగింపు ఉంటుందని, అలాగే 20వ తేదీన బోనాల పండుగ ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల కోసం ఇప్పటి నుండే అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల భారీగా తరలిరానున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్