రాజేంద్రనగర్ సర్కిల్‌లో మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న వెంకన్న గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం తెల్లవారు జామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం చేయడంతో పాటు మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి, శ్రద్ధతో పూజలు నిర్వహించారు.