రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజామున స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించబడింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఆదర్శ కాలనీ, భావన ఋషి నగర్ ప్రాంతాలలో శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది.