రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గల లంగర్ హౌస్ టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద విద్యార్థులను తరలించే ప్రైవేట్ స్కూల్ బస్సుల పై ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబందలను పాతర వేస్తున్న స్కూల్ బస్సు లను గుర్తించి సంబంధిత కేసులు నమోదు చేసి బస్సులను సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాలు మార్లు హెచ్చరించినా పట్టించుకోని యాజమాన్యం పై అధికారులు చర్యలు చేపట్టారు.