శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. నూతన మున్సి పాలిటీ కార్యాలయంలోని సమావేశమందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ అధ్యక్షతన మంగళశారం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శంషాబాద్ పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుం టున్నానన్నారు.