2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలపడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్ లక్ష్మీనగర్ పార్కులో మార్నింగ్ వాకర్స్ ను శనివారం కలిశారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్న యువతీ, యువకులు తమ అమూల్యమైన ఓటును దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న నరేంద్ర మోదీకి మాత్రమే వేయాలని కోరారు.