రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో గత రెండు రోజుల క్రితం కరెంట్ రిపేర్ చేస్తుండగా షాక్ కు గురైన చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కరెంట్ షాక్ గురైన వెంటనే తోటి కార్మికులు అతడిని ఆసుపత్రికి తరలించగా, హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.