రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నేచర్ క్యూర్ హాస్పిటల్ ఫతేనగర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలు వయస్సు 45 నుంచి 50 మధ్యలో ఉంటుందని, తెలుపు రంగు చీరను ధరించి ఉందని నాంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మురళి తెలిపారు.