సికింద్రాబాద్ లో 5 నెలలు పుష్కలంగా కురిసిన వర్షం
ఈ ఏడాది సికింద్రాబాద్ మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు 961 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా కురిసే 724 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ. ఈ అధిక వర్షాల కారణంగా భూగర్భ జల నీటిమట్టం కూడా పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలోనే నమోదైనట్లు శుక్రవారం వాతావరణ శాఖ తెలిపింది.