భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్, 8 మంది అరెస్ట్
నగరంలో నకిలీ ఆహార పదార్థాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సికింద్రాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న దాని కేంద్రంపై ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సుమారు 1500 కేజీల పేస్ట్, 55 కేజీల యాసిడ్ సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. అరటి బోదెలు, ఇతర చెట్ల కాండాలతో పేస్ట్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.