కేజీబీవీ పాఠశాలలో ఈనెల 12 నుండి విద్యార్థినీ లకు కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా జీసిడిఓ శోభారాణి చెప్పారు. మంగళవారం కల్వకుర్తిలో వంటకాల తయారీ, పరిశుభ్రతపై జిల్లాలోని కేజీబీవీ లలో వంట చేస్తున్న మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.