చందానగర్ నుండి అమీన్‌పూర్ వెళ్లే రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీనాయకులు రవికుమార్ మాట్లాడుతూ, 2017లో రోడ్డువిస్తరణకు రూ. 4 కోట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని ఆరోపించారు.