వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల సమయంలో నీరు నిలిచే చోట శాశ్వత పరిష్కారం చూపాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందజేయాలని సూచించారు.