శేరిలింగంపల్లి ఆలయాల్లో భక్తుల కిటకిట

3చూసినవారు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు, దర్శనాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా చందానగర్‌లోని విశాఖ శ్రీశారదా పీఠపాలిత వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తొలి ఏకాదశి శుభ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్