భగవంతుని నామస్మరణ చేయడంతో మానసిక ప్రశాంతత తో పాటు శారీరక ఉల్లాసం కలుగుతుంది అని రాజేంద్రప్రసాద్, సురేందర్ ప్రసాద్ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామదేవతల ఆలయాల నిర్మాణానికి శనివారం రాజేంద్రప్రసాద్, సురేందర్ ప్రసాద్ 1, 01, 000/- రూపాయలు విరాళాన్ని వారి స్వగృహంలో మున్సిపల్ చైర్ పర్సన్ బతుక లావణ్య దేవేందర్ యాదవ్ కు చెక్కును అందజేశారు.