ట్రెయినింగ్ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదని శనివారం ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు. ఆలయంలో చండీహోమం నిర్వహించగా అమ్మవారికి సాక సమర్పించాలని పురోహితులు సూచించడడంతో మహిళలతో కలిసి అమ్మవారికి సాక సమర్పించారు. ఆరు ఆలయాలపై దాడులు జరిగినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.