పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు. 10. 468 పండిత, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. మీరు నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాల్సిందిగా సూచిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.