చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా

71చూసినవారు
చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోవిస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షికుంట చెరువు కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి బక్షికుంట పరిసరాలను పరిశీలించి ఆక్రమణల గూర్చి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్