ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో తెలంగాణ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సోమవారం భేటీ అయ్యారు. అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కోసం అల్పాహార పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.