గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో చలి తీవ్రత బాగా పెరిగింది. రానున్న ఐదు రోజులు తెలంగాణలో చలి ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గురువారం తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీలు తగ్గుముఖం పట్టాయన్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఇబ్బంది పెడుతుందని, చిన్న పిల్లలు, వృద్దులు జాగర్తగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, ముదురు రంగు దుస్తులు ధరించాలన్నారు.