మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

76చూసినవారు
మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్‌: మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం కలకలం రేపింది. నవీన్‌రెడ్డి తాను పనిచేస్తున్న భవనం 8వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్