గచ్చిబౌలిలోని పబ్‌లపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

62చూసినవారు
గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినల్‌లో ఉన్న పబ్‌లపై ఎస్‌ఓటీ మాదాపూర్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించి డ్రగ్స్ తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు, "క్లబ్ రఫ్" (CLUB ROUGH) "ఫ్రాట్ హౌస్ పబ్" (FRAT house pub) లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో మొత్తం నలుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లు గుర్తించినట్లు శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్